బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు పెరిగాయని వాతావరణ విభాగ మాజీ డైరెక్టర్ పీవీ.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో నవంబర్ ముగిసే సమయానికి ఏకంగా సగటున 35.35 అడుగులు ఎత్తుకు చేరుకున్నాయని వెల్లడించారు. గత ఇరవైఏళ్ల చరిత్రలో ఈ స్థాయిలో భూగర్భ జలాలు పెరగటం ఇదే తొలిసారన్నారు. జూలై నుంచి నవంబర్ వరకు నమోదైన వర్షపాతంలో కోస్తాంధ్రలో 25 శాతం, రాయలసీమలో 72 శాతం, తెలంగాణలో 46 శాతం అధిక వర్షపాతం నమేదైనట్లు వివరించారు. ఈ సీజన్‌లో భూగర్భజలాల సగటు లోతు కోస్తాంధ్రలో 34.14 అడుగులు, రాయలసీమలో 58.28 అడుగులు, తెలంగాణలో 16.24 అడుగులుగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...