విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.2 కోట్ల పనులకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ శంకుస్థాపన చేశారు. పట్టణంలోని రెడ్డివారి ప్రశాంత్ నగర్, అయ్యన్న కాలనీ తదితర వీధుల్లో సిమెంటు రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లూడుతూ... ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారంచుడతామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:ప్రైవేటు ఉద్యోగుల వేతనాలపై నేడు సుప్రీం కీలక తీర్పు