ETV Bharat / state

'వ్యాధులు రాకముందే అధికారులు చర్యలు తీసుకోండి' - ఎర్రంపేటలో భారీ వర్షాలు వార్తలు

విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సీపీఏం ఆధ్వర్యంలో నాతవరం మండలం ఎర్రంపేట గ్రామ గిరిజనులు ధర్నా చేశారు. గ్రామంలో వర్షం నీరు నిల్వ ఉందని.. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వ్యాధులు రాకముందే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

errampeta villagers protest at narsipatnam sub collector
ఎర్రంపేట గిరిజనులు ధర్నా
author img

By

Published : Oct 19, 2020, 11:06 PM IST

భారీ వర్షాల కారణంగా తమ గ్రామంలో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయని విశాఖ జిల్లా నాతవరం మండలం ఎర్రంపేట గ్రామ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వర్షపు నీరు ప్రవహించకుండా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు.

దీనివల్ల గ్రామంలో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులకు వినతి పత్రం అందించారు.

ఇదీ చూడండి:

ఘనంగా దేవి శరన్నవరాత్రులు.. గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.