Student Suicide at Marripalem: విశాఖ జిల్లాలోని మర్రిపాలెం రైల్వేస్టేషన్ వద్ద ఓ యువకుడి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు ఇంజనీరింగ్ చదువుతున్న పవన్‌గా గుర్తించారు. పవన్ వద్ద లభించిన ఆధారాలతో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్‌ఫోన్ నుంచి తల్లిదండ్రులకు.. 'మిమ్మల్ని బాధపెట్టాను... సుమారు లక్ష వరకు అప్పు చేశాను' అనిమెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన వల్ల భవిష్యత్తులోనూ తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవని.. నాన్నా ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పంపినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: