గ్రామాల్లో నాటుసారా నియంత్రణకు విశేషంగా కృషి చేయాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ పోలీసులకు సూచించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం స్టేషన్ను సందర్శించి.. పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
స్పెషల్ బ్యూరో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు నాటుసారాపై నమోదు చేసిన కేసుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. సారా తయారుచేసే గ్రామాలపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. వారానికో గ్రామం చొప్పున రెవెన్యూ అధికారులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
ఇవీ చదవండి..