విశాఖ జిల్లా పాయకరావుపేట పాండురంగ స్వామి దేవస్థానానికి చెందిన దుకాణాలను జిల్లా దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ శాంతి సీజ్ చేశారు. ఇక్కడి దుకాణాలు 2005 సంవత్సరం నుంచి చేతులు మారుతున్నట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలు చేశారు.
దేవాదాయశాఖ నుంచి దుకాణాలు పొందిన యజమానులు.. వాటిని వేరే వ్యక్తులకు ఇచ్చి అదనపు అడ్వాన్స్ లు, అద్దెలు వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. యజమానులు దేవాదాయ శాఖకు నామమాత్రపు అద్దెలు చెల్లిస్తూ.. షాపులు లీజుకు తీసుకున్న వారి వద్ద నుంచి భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారని ఎసీ తెలిపారు. దేవాదాయ శాఖ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి: