విశాఖ జిల్లాలో పరిషత్ పోలింగ్‌కు ఓటర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సబ్బవరంలో ఓటర్లు ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి పోటెత్తారు. 7 గంటలకు పోలింగ్ కేంద్రం తెరుచుకోగానే ఒక్కసారిగా కేంద్రంలోకి దూసుకెళ్లారు. ఓటర్లను అదుపు చేయడానికి పోలీసులు ఇబ్బంది పడ్డారు. తల్లులు చంటి పిల్లలకు ఎత్తుకుని పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
ఇదీ చదవండి: విశాఖలో పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం