ETV Bharat / state

రోడ్డుపై వ్యాన్​ బోల్తా.. గుడ్లు ఎత్తుకెళ్లిన స్థానికులు - vadlapudi

వడ్లపూడి వంతెన సమీపంలో వ్యాన్​ బోల్తాపడింది. వాహనంలో ఉన్న గుడ్లన్నీ రోడ్డుపై పడ్డాయి. సమాచారం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలానికి వచ్చారు. చేతికి దొరికిన గుడ్లన్నీ తీసుకుని చల్లగా జారుకున్నారు.

వ్యాను బోల్తా.... కోడిగుడ్లు గోవిందా!!
author img

By

Published : May 27, 2019, 1:44 PM IST

Updated : May 27, 2019, 1:52 PM IST

వ్యాను బోల్తా.... కోడిగుడ్లు గోవిందా!!

విశాఖ జిల్లా గాజువాక వడ్లపూడి బ్రిడ్జ్​ వద్ద లోడ్​తో ఉన్న గుడ్ల వ్యాన్​ బోల్తా పడింది. అనపర్తి నుంచి గాజువాక వస్తున్న వాహనం తెల్లవారుజామున వడ్లపూడి వంతెన సమీపంలో అదుపు తప్పింది. స్వల్ప గాయాలైన డ్రైవర్​ను ఆసుపత్రిని తరలించారు. రోడ్డుపై పడిన గుడ్లను స్థానికులు తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

వ్యాను బోల్తా.... కోడిగుడ్లు గోవిందా!!

విశాఖ జిల్లా గాజువాక వడ్లపూడి బ్రిడ్జ్​ వద్ద లోడ్​తో ఉన్న గుడ్ల వ్యాన్​ బోల్తా పడింది. అనపర్తి నుంచి గాజువాక వస్తున్న వాహనం తెల్లవారుజామున వడ్లపూడి వంతెన సమీపంలో అదుపు తప్పింది. స్వల్ప గాయాలైన డ్రైవర్​ను ఆసుపత్రిని తరలించారు. రోడ్డుపై పడిన గుడ్లను స్థానికులు తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Intro:నరసరావుపేట మండలంలోని ఇస్సపాలెం గ్రామం వద్ద కారు బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మృతి, నలుగురికి గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది.


Body:సత్తెనపల్లి నుండి నరసరావుపేట అతి వేగంగా వస్తున్న ap 07 ce 6336 నెంబర్ గల కారు ఇస్సపాలెం గ్రామం వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి సుమారు వంద అడుగుల దూరం బోల్తా కొట్టింది. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న నకరికల్లు మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన గోపు. శ్రీనివాసరెడ్డి కారులోంచి యాభై అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. నకరికల్లు మండలం దేచవరానికి చెందిన మాజీ ఎంపీటీసీ కొండా వెంకటేశ్వరరెడ్డిని ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.


Conclusion:అదే కారులో ప్రయాణిస్తున్న నకరికల్లు మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన మరో నలుగురైన పాపిరెడ్డి, కరిముల్లా, షేక్ శిలార్, వెంకటేశ్వర్లు లు తీవ్రగాయాలతో పట్టణంలోని ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు ప్రమాదానికి అతివేగమే కారణమని నరసరావుపేట రూరల్ ఎస్సై షఫీ తెలిపారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
Last Updated : May 27, 2019, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.