ETV Bharat / state

ఇకపై రైళ్లలోనే జీరో ఎఫ్ఐ​ఆర్ నమోదు..!

రైళ్లలో నేరాల నియంత్రణకు తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేస్తే వెంటనే జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేసేలా అవకాశం కల్పించింది. వందకు పైగా రైళ్లలో ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

east coast railways
east coast railways
author img

By

Published : Nov 12, 2020, 3:54 PM IST

రైళ్లలో దొంగతనాలు, పోకిరీల అల్లరి చేష్టలు వంటి ఘటనలు జరగుతుంటాయి. ఈ తరహా నేరాలను అరికట్టేందుకు తూర్పు కోస్తా రైల్వే పూనుకుంది. భద్రతా సిబ్బందికి ప్రయాణికులు ఫిర్యాదు చేస్తే కదులుతున్న రైల్లోనే జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేసేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) విద్యా భూషణ్ భద్రతా సిబ్బందికి ఉత్తరులు ఇచ్చారు. వందకు పైగా రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది ఉండాల్సిందిగా ఆదేశించారు. అన్ని ముఖ్యమైన రైళ్లలోనూ జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ఈ ఆదేశాల వల్ల తూర్పు కోస్తాలో వందకు పైగా ప్రత్యేక రైళ్లకు ఆర్పీఎఫ్, జీఆర్పీ రక్షణ ఉంటుంది. ఎఫ్​ఐఆర్ దరఖాస్తులను ముఖ్యమైన రైళ్లలో సిబ్బంది వద్ద అందుబాటులో ఉంచుతారు. ప్రతి ప్రత్యేక రైళ్లోనూ ఎస్-1 కోచ్​లో 63వ నంబర్ బెర్త్​ను భద్రతా సిబ్బందికి కేటాయించారు. అలాగే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఏసీ ఛైర్ కార్‌లో నాలుగో నంబర్ సీట్‌ను భద్రతా సిబ్బందికి కేటాయించారు. రాజధాని ఎక్స్​ప్రెస్​లో పాంట్రీకార్​లో భద్రతా సిబ్బంది ఉంటారు. పెట్రోలింగ్ సిబ్బందితో ఈ భద్రతా సిబ్బంది సమన్వయం చేసుకునేట్టుగా చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి

ఫోన్​ టార్చ్​ వెలుతురులో ప్రసవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.