విశాఖ జిల్లా నర్సీపట్నంలోని దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో ఎండోమెంట్ అధికారులు ఆలయ హుండీ లెక్కింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను కొనసాగించారు. హుండీలో ఆదాయం 4లక్షల 67వేల 3 వందల రెండు రూపాయలున్నట్టు గుర్తించారు.
కరోనా కారణంగా దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ శాంతి పేర్కొన్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు సంబంధించి ఆర్భాటం లేకుండా పూజలతో మాత్రమే కొనసాగిస్తామని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారి శర్మ, ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఆలయ కమిటీ సభ్యులు శివ నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జగన్మాత దుర్గమ్మకు సీపీ దంపతుల తొలి సారె సమర్పణ