ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను విశాఖ జిల్లా మున్సిపల్ కార్యాలయంలోని నోటీస్బోర్డులో అంటించారు. ఎన్నికల సామగ్రిని అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఒక గదిలో ఉంచి సీల్ చేశారు. రికార్డులన్నీ భద్రపరిచారు. ఎన్నికల వాయిదా పడ్డాయని తెలియటంతో ఈ రోజు కిటకిటలాడే ఎన్నికల కార్యాలయం బోసిపోయింది. అధికారులు తప్ప అభ్యర్థులు ఎవరూ కనిపించలేదు.
ఇదీ చూడండి 'సీఎం కంటే ఎన్నికల కమిషనర్ ఎక్కువా?'