ETV Bharat / state

నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారిన భవనాలు - buildings wastage news in visakha dst rolugunta

విశాఖ జిల్లా రోలుగుంటలో వివిధ అవసరాల కోసం లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన విలువైన భవనాలు వృథాగా మారాయి. లక్షలాది రూపాయల నిధులు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయని స్థానికులు అంటున్నారు.

due to negligence of officers buildings  are become unused

author img

By

Published : Jul 27, 2020, 9:50 AM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండల కేంద్రంగా ఏర్పాటైన కొత్తలో ఉప ఖజానా కార్యాలయం నిర్మించాలని యోచించి అప్పట్లో 8 లక్షల రూపాయలతో భవనం నిర్మించారు. వినియోగంలోకి తీసుకు రాకుండా నిరుపయోగంగా వదిలేశారు. ఎన్నో ఏళ్లుగా ఎస్సీ బాలుర కోసం నిర్మించిన హాస్టల్ భవనం వృథాగా ఉండిపోయింది. ఇక్కడి వసతిగృహాన్ని నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం ఎత్తివేయటంతో ఈ భవన సముదాయం వృథా అయిపోయిందని నిర్వాహకులు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవనం రావటంతో పూర్వ భవనాన్ని నిరుపయోగంగా వదిలేశారు.

ఐకేపీ ద్వారా నిర్మించిన వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నిరుపయోగంగా వదిలేశారు. లక్షలాది రూపాయలు వృథా అవటంతో పాటు విలువైన భవనాలను నిర్లక్ష్యంగా పాలకులు వదిలేయటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. స్వల్ప మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి

స్వీబీసీ ట్రస్టుకు 2.1కోట్లు విరాళం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.