విశాఖలో నిరాశ్రయులను ఆదుకునేందుకు ఔషధ దుకాణాల సంఘం ఆధ్వర్యంలో ఔషధ నియంత్రణ శాఖ ముందుకు వచ్చింది. సరుకుల పంపిణీని శాఖ ఉప సంచాలకులు గోవిందం పరిశీలించారు. పేదలకు వస్తువులను పంపిణీ చేశారు. ప్రతి రోజూ విశాఖ నగరంలో ఉన్న నిరాశ్రయ వసతి గృహాల్లో తాము సాయంత్రం టీ, టిఫిన్, అవసరమైన మందులు, వ్యక్తిగత పరిశుభ్రతకు అవసరమైన వస్తువులను విడతలుగా సరఫరా చేస్తున్నామని మందుల దుకాణాల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు చెప్పారు.
ఇవీ చదవండి: