విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో నెల రోజులుగా తాగునీరు రావడంలేదని గ్రామస్థులు అంటున్నారు. ఈ గ్రామంలో సుమారు 5వేలం మంది ఉంటున్నారు. వీరి తాగునీటి అవసరాల కోసం సమీప కొండ ప్రాంతంలో 3 బోర్లు వేసి.. కుళాయిల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు.
అయితే అవి పాడైపోవటంతో గత నెలరోజులుగా తాగునీరు రావడంలేదు. బిందెడు నీళ్లకోసం మహిళలు వ్యవసాయ బోర్లను, బావులను ఆశ్రయిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి..