విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నారసింహుని డోలోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా.. ప్రతి ఏటా హొలీ పండుగ రోజున సింహాద్రి అప్పన్న సోదరి అయిన పైడితల్లి అమ్మవారి కుమార్తెలు.. శ్రీదేవి, భూదేవిలను తనకిచ్చి వివాహం చెయ్యమని కోరుతారు. అందుకు సోదరి సమ్మతించటంతో ఆనందంతో రంగులు చల్లుకుంటారు. ఈ సందర్భంగా స్వామివారి పెళ్లి చూపుల ఉత్సవం ఘనంగా నిర్వహించిన అనంతరం భక్తుల దర్శనార్థం గ్రామ తిరువీధి జరుపుతారు.
ముందుగా స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకిపై.. స్వామివారు సింహగిరి క్రిందకు చేరుకుంటారు. అక్కడ పైడితల్లి అమ్మవారిని పిల్లని ఇమ్మని అడిగి.. వరాహ పుష్కరిణికి చేరుకొని వసంతోత్సవం, చూర్ణోత్సవ కార్యక్రమాలు జరిపిస్తారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తారు.
ఇవీ చూడండి...