అల్లోపతి వైద్యాన్ని..ఆయుర్వేదంతో కలపాలని కేంద్రం యోచించటం పట్ల వైద్యుల నిరసనల జోరు పెరుగుతోంది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట వైద్యులు నిరసన తెలిపారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం బేషరుతుగా ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో జాతీయ స్థాయిలో కార్యాచరణ ప్రకటించి వైద్యసేవలు నిలిపివేస్తామని ఐఎంఏ వైద్యలు స్పష్టం చేశారు.
సంప్రదాయ వైద్యం, ఆధునిక వైద్యం చాలా భిన్నమైనవని.. దీనిని ఆయుర్వేదంతో కలపాలని చూడటం సమంజసం కాదన్నారు. ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే వెసులుబాటు కల్పించటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
ఇదీచదవండి