విశాఖ అక్కయ్యపాలెంలో ఈ నెల 3న జరిగిన దారుణ హత్య రోజుకో మలుపు తిరిగింది. ఈ కేసులో అనేక కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు మరోమారు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా రిమాండ్లో ఉన్న దివ్య భర్త వీరబాబు, బాబాయ్ కృష్ణలను తిరిగి కస్టడీలోకి తీసుకుని విచారించారు. అనైతిక వ్యాపారంలో దివ్యకు వచ్చిన నగదు వీరి మధ్య బదిలీ జరగడంతో మరోమారు వీరిని విచారించినట్లు తెలుస్తోంది. ఈ నెల 3వ తేదీన దివ్య హత్యకు గురయ్యింది. ఇప్పటివరకు ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.
ఇదీ చదవండి: రష్యాలో ఘనంగా విక్టరీ పరేడ్.. రాజ్నాథ్ హాజరు