ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల నిధులను అమ్మ ఒడి పథకానికి కేటాయిస్తూ విడుదల చేసిన జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని దళిత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. విశాఖ అంబేడ్కర్ భవన్లో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
అమ్మ ఒడి పథకానికి ప్రభుత్వం రూ.6,456 కోట్లు విడుదల చేయగా... వాటిలో రూ.6,108 కోట్లు బడుగుల కార్పొరేషన్ల నుంచి కేటాయించారని దళిత నాయకులు స్పష్టం చేశారు. బీసీ కార్పొరేషన్ నుంచి రూ. 3,432 కోట్లు, కాపు కార్పొరేషన్ నుంచి రూ.568 కోట్లు, మైనారిటీ కార్పొరేషన్ నుంచి రూ. 442 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.395 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఒక వెయ్యి 271 కోట్లు మళ్లించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు, బొడ్డు కళ్యాణ్ రావు, కొత్తపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..కులం చెబితే కేసులు ఉండవా!