ETV Bharat / state

ప్లాస్మా దానంపై అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ - కరోనా వైరస్

విమ్స్​లో ఏర్పాటు చేసిన 650 పడకలను సెప్టెంబరు ఒకటి నాటికి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్​ వి.వినయ్​ చంద్​ అధికారులను ఆదేశించారు. కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు.

Visakha Institute of Medical Sciences
Visakha Institute of Medical Sciences
author img

By

Published : Aug 28, 2020, 8:42 PM IST

విమ్స్​లో ఏర్పాటు చేసిన 650 పడకలను సెప్టెంబరు ఒకటి నాటికి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్​ వి.వినయ్​ చంద్​ అధికారులను ఆదేశించారు. విమ్స్​ను తనిఖీ చేసిన ఆయన... సిబ్బంది పనితీరు పర్యవేక్షణలో భాగంగా సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. ఆస్పత్రిలో కావాల్సిన పరికరాలను సమకూర్చుకోవాలన్నారు. ఇటీవల రిక్రూట్ చేసిన అభ్యర్థులకు వెంటనే నియామకపత్రాలు అందజేయాలని తెలిపారు. సిబ్బందిని మూడు షిప్టులుగా విభజించి, ప్రతి షిప్టుకు ఒకరిని భాద్యుడిగా నియమించాలని స్పష్టం చేశారు.

గత రెండు నెలల కాలంలో కొవిడ్ నుంచి కోలుకున్న వారి ప్లాస్మాలను సేకరించాలని కలెక్టర్ సూచించారు. వారికి ప్లాస్మా దానంపై అవగాహన కల్పించాలని అన్నారు. ఫ్లాస్మా దానం చేసిన వారికి ప్రోత్సాహక బహుమతిగా ప్రభుత్వం అందిస్తున్న అయిదు వేల రూపాయలను మొత్తాన్ని ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి తెలిపారు.

ఇదీ చదవండి

అచ్చెన్న కేసు: అరెస్టు నుంచి బెయిల్ మంజూరు వరకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.