విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం చీడిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేపట్టారు. గ్రామానికి చెందిన తేదేపా నేతలు డొకల అక్కునాయుడు, డొకల దేముడునాయుడు సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
తేదేపా మాడుగుల నియోజవర్గం ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికీ 5 కిలోల చొప్పున కూరగాయలను ఊరంతా పంచారు. పార్టీ నేతలు పి.వి.జి. కుమార్, వంటకు సూర్యనారాయణ, వేచలపు ఎర్రినాయుడు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: 'మద్యం' విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి