విశాఖ జిల్లా చోడవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో కూరగాయలు, కోడిగుడ్లు, ఇతర నిత్యావసరాలు అందజేశారు. తెలుగు దేశం పార్టీ నాయకుడు, గోవాడ చక్కెర కర్మాగారం పాలకవర్గం మాజీ ఛైర్మన్ గూనురు మల్లునాయుడు సారధ్యంలో ఈ సామగ్రి పంపిణీ చేశారు. లాక్డౌన్లో నిరాశ్రయులైన వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు గూనూరు పెదబాబు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కనిశెట్టి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి గిరిజన గ్రామాల్లో నిత్యావసరాలు పంపిణీ