వైకాపా కార్పొరేటర్ ముర్రు వాణి నానాజీ, పార్టీ నేత కొలుసు కుమార్ ఆధ్వర్యంలో విశాఖలోని ఐటీఐ జంక్షన్ వద్ద పాత్రికేయులకు నిత్యావసర సరకులు, కరోనా కిట్లు పంపిణీ చేశారు. నగర పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విజయప్రసాద్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కొవిడ్ సమయంలో జర్నలిస్టుల సేవలు మరువలేనివని ముర్రు వాణి అన్నారు. కొవిడ్ బాధితులకు, పేద ప్రజలకు తమ వంతు సాయం అందిస్తున్న కుమార్ను అభినందించారు.
పాత్రికేయులపై తమకు ఎంతో గౌరవం ఉందని కొలుసు కుమార్ అన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిలా ఉంటూ… ప్రాణాలకు తెగించి కరోనాపై అవగాహన కల్పిస్తున్న జర్నలిస్టులకు తన వంతు సాయం అందించడం సంతృప్తిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా వేళ.. ప్రజాభిప్రాయ సేకరణలేల?