విశాఖ జిల్లాకు సంబంధించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు గ్రామీణ జిల్లాలోని నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోగల మండలాలకు కలిసి ప్రస్తుతం 52 ,050 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో యూడీఏ పరిధిలోగల 15 మండలాలు.. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం, పరవాడ, అనకాపల్లి , కసింకోట, ఎలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక , ఎస్ రాయవరం , నక్కపల్లి, పాయకరావుపేట మండలాలకు 38, 865.. జీవీఎంసీతో పాటు నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీలకు 13,185 ఇళ్లను కేటాయించింది.
యూడీఏ మండలాల్లో ఇంటి నిర్మాణానికి కేంద్రం వాటా రూ.1.5.లక్షలు , ఉపాధిహామీ పథకం నుంచి రూ.30 వేలు కలిపి రూ.1.8.లక్షలు ఇవ్వనున్నారు. విశాఖ నగరంతో పాటు ఎలమంచిలి నర్సీపట్నం మున్సిపాలిటీల్లో కేంద్రం ఇచ్చే 1.5 లక్షలకు అదనంగా రాష్ట్రప్రభుత్వం 30,000 ఇవ్వనుంది . గ్రామీణ ప్రాంతంలో ఈ నెల 25న ఇళ్ల స్థలాల పంపిణీ ఇప్పటికే అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాలో ఉన్న పలువురు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ స్థలంలో పాకలు వేసుకుని నివాసం ఉంటున్న మరికొంతమందికి ప్రభుత్వం ఎల్పీసీలు ఇవ్వనుంది. వీరితో పాటు సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణానికి సాయం కోసం నిరీక్షిస్తున్న వారికి ఈ ఇళ్ల మంజూరులో ప్రాధాన్యం ఇస్తారు.
ఇటువంటి వారంతా గ్రామ / వార్డు సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో అర్బన్ ప్రాంతంలో ప్రతి ఇంటికి 2.5 లక్షలు, యూడీఏ మండలాల్లో రెండు లక్షల చొప్పున మంజూరు చేశారు. ప్రస్తుతం అందులో కోత విధించడంపై దరఖాస్తుదారుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. గడచిన రెండేళ్లలో మెటీరియల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. దానికితోడు ఇసుక దొరకడం గగనమవుతోంది.ఈ పరిస్థితుల్లో యూనిట్ ధర మరింత పెంచుతారనుకుంటే ఊహించని విధంగా తగ్గించడంపై లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు.
ఇదీ చూడండి: