విశాఖ జిల్లా దేవరాపల్లి - అనంతగిరి మార్గంలో శారద నదిపై కాలిబాట రెండేళ్ల క్రితం శిథిలమై గుంతలు పడ్డాయి. ప్రస్తుతం వర్షాలకు కాలిబాట మరింత బురదగా తయారై.. ప్రమాదకంగా మారింది. కాలిబాట నుంచే 4 మండలాలకు చెందిన దాదాపుగా 200 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రెండేళ్ల క్రితం శిథిలమైన కాలిబాటకు మరమ్మతులు చేయలేదు. మరోవైపు అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణం పూర్తి చేయలేదు. ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. అధికారులు స్పందించి కాలిబాటకు మరమ్మతులు చేపట్టి, అసంపూర్తిగా ఉన్న వంతెన పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి. క్షేమంగా ఇంటికి చేరుకున్న మత్స్యకారులు