విశాఖ జిల్లా అనకాపల్లిలో ఒకే రోజు తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. ఈ క్రమంలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అనకాపల్లిలోని దాసరి గెడ్డ ప్రాంతంలో ముగ్గురికి, శతకంపట్టు వద్ద ఒకరికి, జంపావారివీధిలో నలుగురికి, సత్యనారాయణపురంలో ఒకరికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.
కేసుల పెరుగదలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మండలం పరిధిలో అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి..