ETV Bharat / state

గ్యాస్ లీకేజ్ బాధిత చిన్నారులకు డీజీపీ పరామర్శ - news of visakha gas leack

విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గ్యాస్ లీకేజ్ బాధితులను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరామర్శించారు. విపత్కర పరిస్థితుల్లో పోలీసులు చేసిన సేవలకు త్వరలోనే రివార్డులు అందిస్తామని తెలిపారు.

కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన డీజీపీ

author img

By

Published : May 9, 2020, 9:43 PM IST

విశాఖ కేజీహెచ్ లో చిన్న పిల్లల వార్డులో ఉన్న క్షతగాత్రులను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నారని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో పోలీసు సిబ్బంది బాగా పనిచేశారన్నారు. వారికి త్వరలో రివార్డులు, అవార్డులు ఇస్తామని చెప్పారు. ఈ ఘటన ద్వారా విధినిర్వహణలో పోలీసుల యొక్క అంకిత భావం స్పష్టంగా కనిపిస్తోదని తెలిపారు.

ఎల్ జీ పాలిమర్స్ యాజమాన్యం పై గోపాలపట్నం పోలీసు స్టేషన్ లో కేసు నమోదై విచారణ జరుగుతోందని అన్నారు. దోషులు ఎంతటి వారైనా చట్ట పరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఘటనపై వివిధ మార్గాల్లో విచారణ జరుగుతోందని చెప్పారు. త్వరలోనే స్థానికులు వారి స్వగ్రామాలకు వెళ్తారని అన్నారు. ఇప్పటికే కొంతమంది గ్రామాలకు వెళ్ళి ఉదయం కంపెనీ వద్ద ఆందోళన చేశారని చెప్పారు.

ఇదీ చూడండి:

నా బిడ్డను నాకు తెచ్చివ్వండి !?" డీజీపీని నిలదీసిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.