విశాఖలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం తొట్లకొండను పరిరక్షించాలని, ప్రజావళికి వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని విశాఖ బౌద్ధ సమాఖ్య, విశాఖ బౌద్ధ పరిరక్షణ సమితి కోరింది. సమితి సభ్యులు విశాఖ అంబేడ్కర్ భవన్లో నిరసన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. తొట్ల కొండ వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ప్రపంచ ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రాలు పరిరక్షించాల్సిన పాలకులే వాటిని నిర్వీర్యం చేయడం తగదన్నారు. ఇప్పటికే తుపాను గాలులకు బౌద్ధ స్తూపం శిథిలమైతే.. ఆ కట్టడం రక్షణకు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ విధంగా వ్యాపార దృక్పథంతో ప్రభుత్వం నడుచుకోవడం తగదని అంటున్నారు.
ఇదీ చదవండి: