ETV Bharat / state

‘తాడి’ వాసుల కష్టాలు... ముందుకు సాగని గ్రామ తరలింపు - పరవాడ ఫార్మాసిటీ వార్తలు

పరిశ్రమల్లో...గట్టిగా పేలుడు శబ్దం వినిపిస్తే...ఆ గ్రామస్థుల గుండె జారిపోతుంది! పరిశ్రమల్లో మంటలు చెలరేగాయంటే చాలు...ఆ ప్రాంతవాసులకు ముచ్చెమటలు పడతాయి! ఎంత ఘాటైన దుర్వాసన వచ్చినా..గాలి పీల్చకపోతే ఊపిరాడదు కనుక మరో దారి లేక... ఆ వాయువులే పీల్చుతూ బతుకు సాగిస్తూ రోగాల ఊబిలో చిక్కుకుపోతున్నారు! ఫార్మాసిటీ ప్రాంతం నుంచి తమ గ్రామాన్ని తరలించాలని ఎన్నో ఏళ్లుగా వేడుకుంటున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది విశాఖ జిల్లాలోని తాడి గ్రామ ప్రజల దుస్థితి.

demand-to-relocate-tadi-village-in-visakhapatnam-district
ముందుకు సాగని తాడి గ్రామ తరలింపు
author img

By

Published : Sep 27, 2020, 10:26 AM IST

విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీకి సమీపంలో ఉన్న తాడి గ్రామాన్ని తరలించాలనే ప్రతిపాదన ఊపందుకుంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని అనేక విధాలుగా మొర పెట్టుకుంటున్నారు. స్వయంగా ప్రజా ప్రతినిధులే ఇప్పుడు ప్రభుత్వంతో ఈ సమస్య పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

520 కుటుంబాలు..1,800 జనాభా

రాష్ట్ర ఫార్మా రంగ అభివృద్ధికి ప్రభుత్వం పరవాడ వద్ద ప్రత్యేక ఆర్ధిక మండలి నిర్మాణం చేసింది. దేశ విదేశాలకు చెందిన 80కి పైగా ఫార్మా కంపెనీలు ఇక్కడ కొలువు తీరాయి. కానీ వీటి మధ్యనే సుమారు 520 కుటుంబాలు, 1,800 మంది జనాభా ఉన్న తాడి గ్రామం ఉంది. పరిశ్రమలు విస్తరించటం, ఫార్మా ఉత్పత్తులు పెరగటం తాడి గ్రామస్తులకు శాపంలా మారింది. ఇక్కడ భూగర్భ జలాలు కలుషితమైయ్యాయి. ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. అందుకే గ్రామస్థులు తమకు వేరేచోట గూడు చూడాలని కోరుకున్నారు. స్వయంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదీప్ రాజా ప్రభుత్వానికి, పరిశ్రమల శాఖకు వినతి పత్రం ఇచ్చి గ్రామాన్ని తరలించాలని కోరుతున్నారు.

2019 ఎన్నికల్లో వైకాపా హామీ..

తెదేపా ప్రభుత్వ హయాంలో తాడి గ్రామం తరలింపుపై ఉత్తర్వు కూడా ఇచ్చింది. పెద్ద ముషినివాడలో పునరావాస కల్పన, రవాణా నిమిత్తం నిర్వాసితులకు చెల్లింపులు ప్రభుత్వం ప్యాకేజీగా ప్రకటించింది. వైకాపా ప్రభుత్వం అయితే స్థానిక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చింది కానీ పట్టించుకోలేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశతో ప్రజలు ఉన్నారు.

ఇదీ చదవండి: ఎస్పీ బాలుకి కొవ్వొత్తులతో నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.