judicial custody for abhishek in Delhi liquor scam : దిల్లీ లిక్కర్ స్కామ్‌లో అభిషేక్ బోయిన్‌పల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇవాళ్టితో అతడి ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈడీ విచారణ కొనసాగుతున్నందున 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ప్రత్యేక కోర్టు తెలిపింది. విజయ్ నాయర్ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు కొనసాగించాలని ఈడీ అధికారులు కోరగా రెండ్రోజుల పాటు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది.
మరోవైపు శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబుకు జైలులో ఇంటి ఆహారం ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టు జడ్జి నిరాకరించారు. జైలు నిబంధనల ప్రకారం అనుమతించడం కుదరదన్న స్పష్టం చేశారు. ఏదైనా కావాలనుకుంటే అధికారులకు చెప్పి చేయించుకోవచ్చని తెలిపారు. కొన్ని పుస్తకాలు తెచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు ప్రత్యేక కోర్టును కోరారు. జైలులో అన్ని పుస్తకాలు దొరుకుతాయని జడ్జి చెప్పారు.
మరోవైపు.. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అభిషేక్, విజయ్ నాయర్‌లకు ఈనెల 21న బెయిల్ మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ వేశారు. వీరి బెయిల్ రద్దు అంశంపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. అభిషేక్, విజయ్‌నాయర్‌కు నోటీసులు జారీ చేసింది. సీబీఐ పిటిషన్‌పై స్పందించాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు సహకరించలేదని అభిషేక్, విజయ్‌నాయర్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి :