విశాఖలోని తూర్పు నౌకాదళానికి మరో అదనపు సదుపాయం తోడైంది. సముద్ర లోతుల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఒక ప్రత్యేక వాహనం సమకూరింది. దీనివల్ల హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రమాదం ఎదురై సముద్రపు లోతుల్లో ఎవరైనా చిక్కుకుంటే వారిని రక్షించేందుకు వీలుంటుందని అధికారులు తెలిపారు. ప్రపంచంలో మొత్తం 40 దేశాలకు మాత్రమే ఈ తరహా వాహనం అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (డీఎస్‌ఆర్వీ)’గా వ్యవహరించే ఈ వాహనం పాడైపోయిన జలాంతర్గామి, అందులోని సిబ్బందిని కాపాడేందుకు సహాయ పడుతుందని అధికారులు వివరించారు. ఈ వెహికల్ని వైస్ అడ్మిరల్ ఏకేజైన్ ప్రారంభించారు. సైడ్ స్కాన్ సోనార్ ద్వారా ఈ వాహనాన్ని సముద్రపు లోతుల్లో ఆపరేట్ చేసే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. భారత్‌కి పశ్చిమతీరంలో ఒకటి, తూర్పుతీరంలో ఒకటి ఈ రకమైన వెహికల్స్‌ని నౌకాదళం సమకూర్చుకుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి..