ETV Bharat / state

ఆ రెండు నిర్ణయాలు వేర్వేరుగా ఉండవు : బొత్స సత్యనారాయణ - విశాఖ కార్పొరేషన్​

ఎన్నికల నిర్వహణకు సంబంధించి వైకాపా అభిప్రాయం, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఒక్కటే అని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశానికి ప్రభుత్వం హాజరైందంటే పార్టీ ఆలోచన కూడా అక్కడ వెల్లడించినట్లేనని స్పష్టం చేశారు.

ఆ రెండు నిర్ణయాలు వేర్వేరుగా ఉండవు : మంత్రి బొత్స సత్యనారాయణ

author img

By

Published : Oct 29, 2020, 7:09 AM IST

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి వైకాపా అభిప్రాయం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వేరుగా ఉండవని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశానికి ప్రభుత్వం హాజరైందంటే పార్టీ ఆలోచన కూడా అక్కడ వెల్లడించినట్లే అని విశాఖలో వెల్లడించారు.

ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి..

ప్రభుత్వంలో భాగస్వామిగా వైకాపా ఉందనే విషయాన్ని ఎన్నికల సంఘం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎన్నికలను వాయిదా వేయడం కారణంగా రూ.3 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులను రాష్ట్రం నష్టపోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ కార్పొరేషన్​కు 2007లో ఎన్నికలు జరిగాయని మంత్రి ప్రస్తావించారు. అప్పటి నుంచి ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. వ్యక్తులతో సంబంధం లేకుండా వ్యవస్థలను గౌరవిస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : స్థానికంపై సమరం...కొత్త నోటిఫికేషన్​కు విపక్షాలు పట్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.