రేషన్ డీలర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం డీలర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం చేపట్టిన ఉచిత పంపిణీ కార్యక్రమానికి ఎనిమిది విడతలుగా తమ సహకారాన్ని అందించినప్పటికీ ప్రభుత్వం తమ సమస్యల పరిష్కరించడంలో విఫలమైందని తెలుపుతూ ప్రత్యేక సమావేశం అయ్యారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా స్పందన లేదన్నారు. ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని డీలర్ల సంఘం నాయకులు మండిపడ్డారు.
మాకవరపాలెం మండలంలో ప్రభుత్వం చేపట్టిన ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరించి సరకులను పంపిణీ చేయకుండా నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని డీలర్ల సంఘం హెచ్చరించింది.
ఇవీ చదవండి: బంద్ పాటించిన రేషన్ డీలర్లు... ఇబ్బందుల్లో కార్డుదారులు