ETV Bharat / state

అరకు లోయ మార్గంలో ప్రయాణం భయం భయం

విశాఖ నుంచి ఆంధ్ర ఊటీ అరకు మధ్య ప్రయాణించే లోయ మార్గం.. ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారి పక్కన ఉన్న బండరాళ్లు విరిగి పడుతున్నాయి. ఇసుక మేటలు వేసి ఉన్న కారణంగా... వాహన చోదకులు ప్రాణభయంతో రాకపోకలు సాగిస్తున్నారు.

author img

By

Published : Jul 14, 2020, 9:46 PM IST

danger  at  araku ghat road
అరకు ఘాట్ రోడ్లో ప్రయాణం భయం భయం

అరకు సోయగాలు ఆస్వాదించడం మాట అటుంచితే.. ఆ మార్గంలో ప్రయాణం... ప్రమాదం జరగకుండా పూర్తి చేయడమే పెద్ద ప్రయాసగా మారింది. ఆర్&బీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోని ఫలితంగా.. రహదారి ప్రయాణం ప్రమాదకరంగా మారింది.

ఘాట్ రోడ్డులో వెళ్లి రావడమే ఇబ్బందికరం అనుకుంటే.. బండరాళ్లు రహదారిపై విరిగిపడుతుండటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికైనా ఆర్&బీ అధికారులు స్పందించి ప్రయాణ చోదకుల అవస్థలు తీర్చాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఆ నలుగురికి.. అమరావతి రైతుల లేఖలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.