Cyber Crime in Visakhapatnam: సైబర్ మోసాల గురించి ఎంతగా అవగాహన కల్పిస్తున్నా నిత్యం ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల గేలానికి చిక్కుతున్నారు. తాజాగా సైబర్ మోసాల గురించి ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాల్సిన సాఫ్ట్వేర్ ఉద్యోగినే.. సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. పార్ట్ టైం ఉద్యోగం పేరిట విశాఖ నగరవాసి నుంచి రూ.8.82 లక్షలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. తగరపువలసకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరుకు ఓ వాట్సాప్ నెంబరు నుంచి పార్ట్ టైమ్ జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు అని సందేశం వచ్చింది. అతనిని నమ్మించేందుకు 100 రూపాయలను అతని ఖాతాలో జమ చేసి.. చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. తర్వాత వివిధ టాస్క్‌ల పేరిట అతన్ని మోసం చేసి రూ.8.82 లక్షలను కొల్లగొట్టారు. ఇంకా డబ్బులు పంపించాలి.. మీ టాస్క్ పూర్తవుతుందని చెప్పటంతో తాను మోసపోయినట్లుగా గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఇవీ చదవండి: