ETV Bharat / state

ఆన్​లైన్​లో మోసాలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు​ - cyber crime in visakhapatnam

హెర్బల్ ఆయుర్వేద పంపిణీదారు పేరిట ఆన్​లైన్​ మోసాలకు పాల్పడిన వ్యక్తిని విశాఖ సైబర్​ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 సెల్​ఫోన్​లు, 4 ఏటీఎం కార్డులు, రూ.34 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఆన్​లైన్​లో మోసాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్​

author img

By

Published : Feb 11, 2020, 2:27 PM IST

ఆన్​లైన్​లో మోసాలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు​

హెర్బల్ ఆయుర్వేద పంపిణీదారు పేరిట ఆన్​లైన్​ మోసాలకు పాల్పడిన వ్యక్తిని విశాఖ సైబర్​ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలుకు చెందిన అబ్దుల్ ముఫీజ్​ కొంత కాలంగా హెర్బల్ ఉత్పత్తుల పంపిణీదారులు కావాలంటూ పత్రికా ప్రకటనలు ఇచ్చి పలువురి దృష్టిని ఆకర్షించాడు.

పంపిణీదారు నియామకం కోసం రూ.11.50 లక్షలను వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల నుంచి వసూలు చేశాడు. ఈ క్రమంలో విశాఖకు చెందిన ఓ వ్యక్తి సైబర్ క్రైం పోలీసులకు సమాచారం అందించాడు. లక్ష రూపాయలను ఆన్​లైన్​ ద్వారా ట్రాన్స్​ఫర్ చేస్తే... పంపణీ సామగ్రి పంపుతానని ముఫీజ్ చెప్పగా ఆమొత్తాన్ని పంపినట్టు బాధితుడు ఫిర్యాదులో వివరించాడు.

విచారణ చేపట్టిన విశాఖ సైబర్ క్రైం సీఐ గోపీనాధ్ బృందం... నిందితుడు కర్నూలుకు చెందిన ముఫీజ్​గా గుర్తించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇదే తరహాలో మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ముఫీజ్​ను అరెస్టు చేసి అతడి నుంచి 3 సెల్​ఫోన్​లు, 4 ఏటీఎం కార్డులు, రూ.34 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల్లో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లా, తెలంగాణా రాష్ట్రం వారు ఎక్కువ మంది ఉన్నట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చూడండి: 'లోన్​ ఇస్తామని ఫోన్ వస్తే దయచేసి నమ్మకండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.