ETV Bharat / state

రూడకోటలో మినరల్​ వాటర్​ ప్లాంట్ ప్రారంభం

ఆంధ్ర - ఒడిశా సరిహద్దు రూడకోటలో గిరిజనుల కోసం మినరల్ వాటర్​ ప్లాంట్​ను సీఆర్పీఎఫ్ అధికారులు ప్రారంభించారు. కమ్యూనిటీ పోలీసింగ్​లో భాగంగా దీనిని నిర్మించినట్టు తెలిపారు.

mineral water plant opening
గిరిజనులకు మినరల్​ వాటర్​ ప్లాంట్
author img

By

Published : Jan 5, 2021, 6:47 PM IST

ఆంధ్ర - ఒడిశా సరిహద్దు పెదబయలు మండలం రూడకోటలో పోలీసు అవుట్​పోస్టు పరిధిలోని సచివాలయంలో రూ.5 లక్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్​ను ఏర్పాటుచేశారు. దీనిని సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ కమాండెంట్ చంద్, డీఎస్పీ అశోక్ కుమార్ పాడేరు డీఎస్పీ రాజ్​కమల్ ప్రారంభించారు.

మండల కేంద్రానికి దూరంగా విసిరేసినట్లు ఉండే రూడకోట పరిసరాల్లో గిరిజనులు తాగునీటి కోసం అనేక అవస్థలు పడుతుంటారు. సమస్యను గుర్తించిన సీఆర్పీఎఫ్ బెటాలియన్ 2020లో ప్లాంట్​ను నిర్మించింది. కరోనా వల్ల ప్రారంభోత్సవం ఇన్నాళ్లూ ఆలస్యమైంది. కమ్యూనిటీ పోలీసింగ్​లో భాగంగా మినలర్ వాటర్ ప్లాంట్​ను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు అందజేసినట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: అందరూ ఉన్నా..ఏకాకి అయ్యాడనే మనస్తాపంతో ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.