విశాఖలో కరోనా పరీక్షల కోసం, టీకా కోసమే కాక.. రెమ్డిసివిర్ ఇంజక్షన్ల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు కొవిడ్ రోగులకు ఈ ఇంజక్షన్లను సిఫార్సు చేస్తుండడమే కారణం.
వీటిని పొందాలంటే జిల్లా వైద్య అధికారి సంతకం తీసుకుని.. జాయింట్ కలెక్టర్ ఆమోదం పొందితే స్టాక్ కౌంటర్లో ఈ ఇంజెక్షన్స్ ఇస్తారు. విశాఖలోని రెడ్నం కంటి ఆసుపత్రిలో ఈ ఇంజక్షన్ అందించే కౌంటర్ ఏర్పాటు చేశారు. దీంతో కొవిడ్ బాధితుల బంధువులు భారీ ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చదవండి: రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండగా ఇలాంటి చర్యలేంటి?