ETV Bharat / state

కార్పొరేట్ సంస్థల కోసమే నూతన వ్యవసాయ చట్టాలు: సీపీఎం

దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని సీపీఎం నేత లోకనాథం అన్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లిలో జరిపిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని మండిపడ్డారు. తక్షణమే ఆ చట్టాలకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

CPM leader Loknath serious comments
కార్పొరేట్ సంస్థల కోసమే నూతన వ్యవసాయ చట్టాలు
author img

By

Published : Dec 19, 2020, 9:03 PM IST

దిల్లీలో పోరాటం చేస్తున్న అన్నదాతలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా దేవరాపల్లిలో జరిపిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ రాజధానిలో 25రోజులుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారని తెలిపారు. వారికి అండగా నిలిస్తేనే వ్యవసాయ రంగం బాగు పడుతుందన్నారు. కరోనాతో దేశమంతా కష్టాల్లో ఉంటే, మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని మండిపడ్డారు. తక్షణమే ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: విశాఖలో అక్రమార్కులకు వణుకు పుట్టిస్తున్న ఎస్​ఈబీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.