Visakha Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమ వైఖరిని మరోసారి స్పష్టం చేయాలని సీపీఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ కూర్మన్నపాలెం వద్ద 743 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న కార్మికులకు ఆయన సంఘీభావం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలని.. ప్లాంట్ను కేంద్రం బలహీనం చేస్తుందని ఆయన విమర్మించారు. స్టీల్ కార్మికులు 743 రోజులుగా చేస్తున్న పోరాటం ప్రపంచ రికార్డని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీలకు ప్రభుత్వ రంగాలను అమ్మాలని చూస్తుందని ఆరోపించారు. దీనిని అడ్డుకునేందుకు రాజకీయాలు పక్కన పెట్టి.. అన్ని పార్టీలు కార్మికులకు మద్ధతు తెలపాలని కోరారు. అంతిమంగా కార్మికులే విజయం సాధిస్తారని.. పోరాటాలతోనే హక్కులను సాధించుకోవాలని అన్నారు.
స్టీల్ ప్లాంట్.. రాజకీయ ఎజెండా: 2024లో జరగునున్న ఎన్నికల ముందు ప్లాంట్ జోలికి రారని,.. వస్తే వాళ్లకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఎన్నికల్లో రాజకీయంగా ఎవ్వరు గెలుస్తారనేది ఒక భాగం. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసమా... భక్షణ కోసమా అనేది రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన సందర్భమన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఓ రాజకీయ ఎజెండాగా ముందుకు తీసుకెళ్లాలని బీవీ రాఘవులు సూచించారు.
" 2024 ఏప్రిల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికలు రాజకీయంగా ఎవ్వరు గెలుస్తారనేది ఒక భాగం.. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం నువ్వు ఉన్నావా స్టీల్ ప్లాంట్ భక్షణ కోసం నువ్వు ఉన్నావా.. రాజకీయ నాయకులు తెల్చుకోవాలని.. మనం నిలదీయాల్సిన సందర్భం ఇది. అందుకనే ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ మరోకసారి విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఉన్నామని చెప్పి ఆంధ్ర ప్రజల ముందు తెలుగు ప్రజల ముందు వాగ్ధానం, ప్రతిజ్ఞ చేసి మీతో పాటు ఉంటామని చెప్పాల్సిన అవసరం ఉంది. శపథం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాళ్లు మోసగాళ్లుగా మిగిలిపోతారు." - బీవీ రాఘవులు, సీపీఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు
ఇవీ చదవండి