చిల్లర వర్తకుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా అనకాపల్లిలో సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడామైదానంలో చిల్లర వర్తకులతో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ నర్సింగరావు మాట్లాడారు. కరోనా కారణంగా అక్కడ మార్కెట్‌ను ఏర్పాటు చేసి అమ్మకాలు చేసేలా జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గాలి, వానకి ఎగిరిపోయిన రేకుల షెడ్లు తిరిగి ఏర్పాటు చేయాలని తెలిపారు. వందల సంఖ్యలో జనం మార్కెట్లోకి వస్తున్నా అధికారులు తగిన రక్షణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు లోకనాథం, జి కోటేశ్వరరావు, మళ్ల సత్యనారాయణ, బాలకృష్ణ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: మిగిలి ఉంది 15నెలలే.. పూర్తి చేయాల్సిన పనులు ఎన్నో..