రాష్ట్రవ్యాప్తంగా 300 మంది ఆత్మహత్యలకు కారణమైన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఉరి తీయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విశాఖలో డిమాండ్ చేశారు. వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఇలాంటి సంస్థల యాజమానులను కఠినంగా శిక్షించాలన్నారు. నాలుగున్నరేళ్లుగా తాము చేస్తున్న పోరాటాలకు వైకాపా ప్రభుత్వం మద్దతు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1,100 కోట్ల రూపాయలు కేటాయించటంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:కొండెక్కిన కూరగాయల ధరలు... సామాన్యుల జేబుకు చిల్లు