విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ (Privatization of Visakhapatnam Steel Plant) కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద 147 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Privatization of Visakhapatnam Steel Plant) ను వ్యతిరేకిస్తూ పోరాటం చేసే కార్మికులకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (cpi national secretary narayana) సంఘీభావం ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆపగలరని, ఆపే శక్తి ఆయనకు ఉందని నారాయణ అన్నారు. సీఎం జగన్ ప్రధాని మోదీకి రాసే ప్రేమలేఖల వల్ల... ఉపయోగం లేదని, సీఎం ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనాలని కోరారు.
ఇదీ చూడండి:
బచావత్ ట్రైబ్యునల్ తీర్పుపై సమీక్ష చట్టవిరుద్ధం: కేంద్రానికి ఏపీ లేఖ