విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాప్తిచెందుతోంది. విస్తర్ల తయారీ పరిశ్రమగా గుర్తింపు పొందిన రావికమతం మండలం కొత్తకోటలో పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఓ యువకుడికి పాజిటివ్ నిర్ధారణ కాగా గ్రామంలో మరో ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గుర్తించారు.
పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి రహదారులను మూసివేశారు. జన సంచారం లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామంలోని వ్యాపార వాణిజ్య సంస్థలకు సమయాన్ని కుదించారు. ఈ మేరకు కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి