ETV Bharat / state

ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు అదృశ్యం... చివరికి పోర్టు రూంలో..! - covid patient missing news

కరోనాతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరుతున్న వారు ఆదృశ్యమవుతుండటం... బాధిత కుటుంబసభ్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనా బారిన పడిన ఓ 79ఏళ్ల వృద్ధుడు విశాఖ విమ్స్​ ఆసుపత్రిలో చేరాడు. ఆగస్టు 5వరకు తమతో రోజు ఫోన్​లో మాట్లాడిన వ్యక్తి.. 6వ తేదీ నుంచి ఆచూకీ లేకుండా పోయిందని కుటుంబసభ్యులు తెలిపారు. చివరికి ఆసుపత్రి స్టోర్ రూంలో శవమై కనిపించటంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.

covid patient missing found in vishaka vims hospital
ఆసుపత్రి స్టోర్ రూంలో లభ్యమైనవిమ్స్​లో అదృశ్యమైన కోవిడ్ బాధితుడు
author img

By

Published : Aug 10, 2020, 11:52 PM IST

విశాఖ ఇనిస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్( విమ్స్)లో మరో దారుణం జరిగింది. కొవిడ్ పాజిటివ్​తో ఐసోలేషన్ లో చేరిన 79 ఏళ్ల విశ్రాంత పోర్టు ఉద్యోగి అచ్చెన్న అచూకీ లేకుండా పోయింది. తమ తండ్రి కనిపించడం లేదంటూ తనయుడు శ్రీనివాస్ ఆసుపత్రి వర్గాలకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం, డైరెక్టర్ పట్టిం చుకోక పోవడం వల్లనే తన తండ్రి మృతి చెందాడని శ్రీనివాస్ ఆరోపించాడు. డైరెక్టర్​ను సస్పెండ్ చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

కొవిడ్ పాజిటివ్ బాధితుడైన అచ్చెన్న ఆగస్టు 1న విమ్స్ లోచేరాడు. పోర్టు ఆసుపత్రిలో ఆ రోజు తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల విమ్స్ కి తీసుకువచ్చి చేర్చారు. ఆగస్టు 5 వరకు ఆయన ఫోన్​లో రోజు కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆగస్టు 6 నుంచి ఆయన ఆచూకీ తెలియకుండా పోవడంతో తనయుడు ఆరా తీస్తూ వచ్చారు. ఇక్కడ కాదు మరో దగ్గర ఉన్నాడని సిబ్బంది నమ్మబలికారు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు డైరెక్టర్ సత్యవరప్రసాద్​ను నేరుగా కలిసి తమ తండ్రి ఆచూకీపై ప్రశ్నించగా... తమకు ఏం తెలుసని ఎదురు ప్రశ్న వేశారు. వృద్ధుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఆసుపత్రిలో వెతకగా... ఎట్టకేలకు ఆసుపత్రి స్టోర్ రూంలో అచ్చెన్న విగతజీవుడిగా కనిపించాడు. విమ్స్ కొవిడ్ ఆసుపత్రిలో తన తండ్రిని కోల్పోయిన కుమారుడు తీవ్ర దు:ఖంతో ఇక్కడికి దయచేసి ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. విమ్స్ డైరెక్టర్ సత్యప్రసాద్​ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

తన తండ్రి కన్పించడం లేదని చెప్పినా ఐదు రోజులుగా కనీసం ఎవ్వరూ పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. చివరికి స్టోర్ రూంలో చనిపోయాడంటూ చెప్పి విమ్స్ సిబ్బంది చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

'నక్సలైటుగా మారేందుకు అవకాశం ఇవ్వండి'.. రాష్ట్రపతికి ఎస్సీ యువకుడి లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.