ETV Bharat / state

'కోవిడ్ కేసులు పెరుగుతున్నా....రికవరీ ఆశాజనకంగా ఉంది'

విశాఖలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారంలో కొంత తగ్గినట్లు కనిపించినప్పటికి ఈ వారం మళ్లీ 900 నుంచి 1000 మధ్య ప్రతిరోజు కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ పెరుగుదల మరికొన్ని రోజుల పాటు ఇలాగే ఉంటుందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు వాడటం వలన కోవిడ్ వ్యాప్తిని తగ్గించవచ్చని వైద్యులు అంటున్నారు.

covid cases increasing at visakha
విశాఖలో కొవిడ్ కేసులు
author img

By

Published : Aug 20, 2020, 1:57 PM IST

విశాఖ జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువవుతోంది. రోజుకు సగటున 900 కేసులు నమోదు అవుతున్నాయి. డిశ్ఛార్జ్ సంఖ్య కొంత మెరుగవగా.. ప్రతిరోజు సగటున 800 నుంచి 900 మధ్య ఉంటోంది. మరణాల సంఖ్య కూడా సగటున 5 నుంచి 7 వరకు ఉంది. ఈ గణాంకాలు ఒక రకమైన మంచి పరిణామాలు సూచిస్తున్నాయి.

విశాఖ నగరంలో 17 ఆసుపత్రులు, 22 కేంద్రాలు కోవిడ్ బాధితులకు అండగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోనే 150 వరకు వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూడటంలో జిల్లా యంత్రాంగం పెడుతున్న ప్రత్యేక దృష్టి కొంతవరకు ఫలితాలిస్తోంది. రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిగా విమ్స్​ను ప్రకటించిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అధ్వాన్నంగా తయారవుతున్నాయని స్థానికులు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ పలు మార్లు సందర్శించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

ఇక పరీక్షలు విషయానికి వస్తే నగరంలోని ముఖ్యమైన ఆరోగ్య కేంద్రాలు, ఛాతి ఆస్పత్రుల వద్ద జనం బారులు తీరుతున్నారు. పరీక్షలు చేయించుకునేందుకు పడిగాపులు పడుతున్నారు. ఛాతీ ఆసుపత్రి వద్ద తెల్లవారుజాము నుంచే టోకెన్ల కోసం వేచిచూస్తున్నారు. మరోవైపు రాపిడ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చిన ... ఆర్టీపీసీఆర్ కోసం ఎదురు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కోవిడ్ కేంద్రాల్లో సదుపాయాల మెరుగుదల కోసం జిల్లా యంత్రాంగం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోజుకు 5 వేల వరకు టెస్టులు చేస్తున్నామని గతంతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 10 నుంచి 15 శాతం తగ్గిందని వైద్యులు చెబుతున్నారు.

ఇదీ చూడండి.

తెలంగాణలో మరో 1,724 కరోనా కేసులు, 10 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.