ETV Bharat / state

విశాఖలో సందడిగా సముద్ర తీర పరిశుభ్రత దినోత్సవం - విశాఖ బీచ్ రోడ్

రాష్ట్రంలోని ప్రముఖ బీచ్​ల్లో అంతర్జాతీయ సముద్రతీర పరిశుభ్రత దినోత్సవాన్ని మెరైన్​ పోలీసులు ఘనంగా నిర్వహించారు. విశాఖ బీచ్​లో కార్యక్రమానికి ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

విశాఖలో సందడిగా సముద్ర తీర పరిశుభ్రత దినోత్సవం
author img

By

Published : Sep 21, 2019, 5:23 PM IST

Updated : Sep 21, 2019, 6:56 PM IST

విశాఖలో సందడిగా సముద్ర తీర పరిశుభ్రత దినోత్సవం

అంతర్జాతీయ సముద్రతీర పరిశుభ్రత దినోత్సవాన్ని విశాఖ బీచ్ రోడ్ లో నగర పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సాగరతీరంలో వ్యర్థాలను తొలగించారు. నెలలో ఒక రోజు నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలని మంత్రులు సూచించారు. విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలని అన్నారు. కార్యక్రమంలో డీఐజీ రంగారావు, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్, ఏయూ వీసీ ప్రసాద రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : తీరంలోని వ్యర్థాలను తొలగించిన నావికాదళం

Intro:ఆదుకోని ఆరోగ్య శ్రీ..!?
* గుండెలో చిల్లులతో ప్రాణాపాయ స్థితిలో చిన్నారి
* బకాయిల భారంతో శస్త్రచికిత్స చేయమంటున్న వైద్యులు
* ప్రభుత్వం ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకలు

ఆ చిట్టి గుండెకు పెద్ద కష్టం వచ్చింది. గుండెకు రంధ్రాలు పడటంతో దినదిన గండంగా పరిస్థితి మారింది. ఆరోగ్య శ్రీ ఊపిరి పోస్తుందనుకుంటే బకాయిల భారాన్ని సాకుగా చూపి వైద్యులు నిరాకరిస్తుండటంతో తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన 14 నెలల వయసున్న లఖినాన సందీప్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమంగా మారుతోంది. బాలుడి తండ్రి త్రినాథరావు కూలిపనులు చేసుకుని జీవిస్తుండగా తల్లి సుజాత గృహిణి. వీరి చిన్న కుమారుడు సందీప్ కు 3 నెలల వయసులో అనారోగ్యానికి గురైనప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించిన సమయంలో విషయం వెలుగు చూసింది. గుండెలో మూడు రంద్రాలు పడి ఉన్నాయని చెప్పడంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ లలోని ఆసుపత్రి లకు తిప్పి చికిత్స చేయించారు. శస్త్ర చికిత్స కోసం రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని విజయవాడ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రి వైద్యులు చెప్పారని, ఆరోగ్య శ్రీ కింద శస్త్రచికిత్స చేయాల్సి ఉన్నప్పటికీ పాత బకాయిలే ఇంతవరకు ప్రభుత్వం చెల్లించని కారణంగా తాము చేయలేమని ఖరాఖండిగా చెబుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికే తాహతకు మించి రూ.3 లక్షలకు పైగా ఖర్చుచేసామని, తమ బిడ్డను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం చిన్నారి రక్తం కలుషితమవుతూ ఆరోగ్యం క్షీణీస్తోందని.. ప్రజాప్రతినిధులు, దాతలు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.

Body:విక్రమ్

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
Last Updated : Sep 21, 2019, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.