విశాఖ జిల్లా చీడికాడ మండలం సిరిజాంలో ఓ గృహిణికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఆమెను విశాఖపట్నం తరలించారు. ఈ మేరకు గ్రామంలో బ్లీచింగ్, హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఊరంతా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. మహిళతో కలిసిన వారిని గుర్తించి పరీక్షలకు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. చీడికాడ మండలంలో ఇప్పటివరకు ఐదుగురుకి కరోనా వైరస్ సోకగా... ఇద్దరు కోలుకున్నారు. ముగ్గురు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
సిరిజాంలో ఓ గృహిణికి కరోనా - విశాఖ జిల్లా
విశాఖ జిల్లా చీడికాడ మండలం సిరిజాంలో ఓ గృహిణికి కరోనా వైరస్ సోకింది. చికిత్స నిమిత్తం విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు.
సిరిజాంలో గృహిణికి కరోనా