కరోనా ప్రబలుతున్న కారణంగా జైలులో ఉండే వారికి కొవిడ్ సోకకుండా జైలు శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా విశాఖ జిల్లాలో జైలు శిక్ష పడే ఖైదీలను తొలుత అనకాపల్లి సబ్ జైల్లో ఉంచనున్నారు. ఇక్కడ కరోనా పరీక్షలు జరిపిన అనంతరం ఇతర జైలుకు తరలిస్తారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఆదేశాలు వెలువడినట్లు అనకాపల్లి సబ్ జైలు సూపరింటెండెంట్ అప్పల నారాయణ తెలిపారు. జిల్లాలో అనకాపల్లి, చోడవరం, యలమంచిలి నర్సీపట్నం ప్రాంతాల్లో సబ్ జైళ్లు ఉన్నాయి. ఈ జైల్లో ఉండేవారికి కరోనా సోకకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ చూడండి...