విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతానికి సంబంధించి స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన కోవిడ్-19 కేంద్రంలో పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు సగటున రోజుకి 100 నుంచి 110 పరీక్షలను నమోదు చేస్తున్నారు. నర్సీపట్నం ప్రాంతంలో రెడ్ జోన్‌గా ప్రకటించిన 22, 23, 24 వార్డులలో ఇప్పటికే పలు నిషేధాలు కొనసాగుతున్నాయి. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో పరీక్షలు ఉమ్మడిగా కొనసాగుతున్నాయి. అనుమానిత రోగులతో పాటు అత్యవసర సమయంలో విధులు నిర్వహించే పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, రెవెన్యూ తదితర ఉద్యోగులకు కూడా పరీక్షలు చేస్తున్నారు.
ఇవీ చదవండి: సత్తెనపల్లి ఘటన దురదృష్టకరం: చంద్రబాబు