ETV Bharat / state

పర్యాటక ప్రాంతాల్లో కనిపించని జనం - కడప గండికోట తాజా సమాచారం

కరోనా ఉద్ధృతి కారణంగా రాష్ట్రంలోని పలు పర్యటక ప్రాంతాల సందర్శనను నిలిపివేశారు. వీటిపై ఆధారపడిన ఎంతో మంది చిరువ్యాపారులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత కఠినంగా మారనుంది.

tourism
పర్యాటక ప్రాంతాలు
author img

By

Published : Apr 26, 2021, 3:27 PM IST

కొవిడ్​ కారణంగా రాష్ట్రంలోని పలు పలు పర్యటక ప్రాంతాల సందర్శనను నిషేధించారు.

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోట సందర్శనను అధికారులు నిలిపివేశారు. గండికోట గ్రామస్థులు కూడా కోట ముఖద్వారం వద్ద రెండు కర్రలను అడ్డుగా పెట్టి లోనికి రానివ్వడంలేదు. అయితే ఈ విషయం తెలియక నేటికి వారాంతరాల్లో పర్యాటకులు వస్తున్నారు. కరోనా తగ్గేవరకూ కోటకు రావొద్దని పర్యాటకులను విన్నవించినట్లు గ్రామస్థులు తెలిపారు.

వెలవెలబోతున్న ఊటీ..

విశాఖలోని ఆంధ్ర ఊటీ అరకులోయ పర్యాటకులు లేక వెలవెలబోయింది. కరోనా ఉద్ధృతి పెరుగుతున్న కారణంగా అరకులోయ అందాలను తిలకించేందుకు వచ్చే సందర్శకులు కరువయ్యారు. అరకులోయలోని పద్మాపురం గార్డెన్స్ గిరిజన మ్యూజియం.. వెలవెలబోతున్నాయి. పర్యాటక శాఖ అతిథి గృహం గదులు ఆక్యుపెన్సీ రేటు బాగా పడిపోయింది. ప్రస్తుత వేసవి సీజన్లో గదులు ఆక్యుపెన్సీ ఏటా 50 శాతం వరకు ఉండగా.. ప్రస్తుతం 10 శాతానికి తగ్గింది. గిరిజన మ్యూజియానికి పర్యాటకుల తాకిడి అంతంత మాత్రంగానే ఉంది. రోజుకి 1500 మంది వరకు పర్యాటకులు గతంలో వస్తుండేవారు.. ప్రస్తుతం ఆ సంఖ్య 50కి మించటం లేదు.

ఇదీ చదవండీ.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఆడిటింగ్.. చర్యలు చేపట్టిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.